రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలకు సంబంధించి పరీక్షలు నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ () సిద్ధమైంది. కరోనావైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో వాయిదా వేసిన పలు పరీక్షల తేదీలను ఇటీవల ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డిగ్రీ లెక్చరర్ల పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో ఉంచినట్లు ఏపీపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. సెప్టెంబరు 15, 16 తేదీల్లో బహుళైచ్ఛిక విధానంలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు. హాల్ టికెట్ల కోసం అభ్యర్థులు వెబ్‌సైట్ చూడొచ్చు. Must read: ఇతర పరీక్షల వివరాలు:
- సెప్టెంబర్ 15, 16వ తేదీల్లో డిగ్రీ కళాశాల లెక్చరర్ల నియామక పరీక్షలు
- సెప్టెంబర్ 21 నుంచి 24 వరకు గెజిటెడ్ ఉద్యోగాల నియామక పరీక్షలు
- సెప్టెంబర్ 21, 22 తేదీల్లో అసిస్టెంట్ బీసీ/సోషల్/ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగ నియామక పరీక్షలు
- సెప్టెంబర్ 22న రాయల్టీ ఇన్‌స్పెక్టర్ ఇన్ మైనింగ్ సర్వీస్ ఉద్యోగ నియామక పరీక్ష
- సెప్టెంబర్ 23న పోలీస్ విభాగంలో టెక్నిల్ అసిస్టెంట్ ఉద్యోగాల నియామక పరీక్ష
- సెప్టెంబర్ 23న సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాల నియామక పరీక్ష
- సెప్టెంబర్ 23,24న పట్టణ ప్రణాళిక విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి నియామక పరీక్ష
- సెప్టెంబర్ 23, 24 తేదీల్లో ఏపీ గ్రౌండ్ వాటర్ విభాగంలో అసిస్టెంట్ కెమిస్ట్ ఉద్యోగాల నియామక పరీక్ష
- సెప్టెంబర్ 23, 24 తేదీల్లో పట్టణ ప్రణాళిక విభాగంలో టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ ఉద్యోగ నియామక పరీక్ష
- సెప్టెంబర్ 25, 26, 27 తేదీల్లో నాన్ గెజిటెడ్ ఉద్యోగాల నియామక పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది.
from Education News in Telugu: News on Board Exam Results, Job Notifications, University Results in Telugu https://ift.tt/33eupB8
0 Comments