ఏపీలో ఇంటర్మీడియట్ ఆన్‌లైన్ ప్రవేశాలు సెప్టెంబర్ ఒకటి నుంచి ప్రారంభించేందుకు ఇంటర్ విద్యా మండలి కసరత్తు చేస్తోంది. ఈ ఏడాది మొదటిసారిగా ఆన్‌లైన్ విధానంలో ఇంటర్ ప్రవేశాలు నిర్వహిస్తున్నారు. మండలానికో ఉన్నత పాఠశాలను జూనియర్ కాలేజీగా మార్చేందుకు చేపట్టిన కసరత్తు పూర్తికానందున ఇవి ఈ ఏడాది అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. అలాగే గతంలో సెక్షన్‌కు 88 మంది ఉండగా.. ఈసారి ఈ సంఖ్యను 40కి తగ్గించారు. ఒక కాలేజీకి ఆర్ట్స్ గ్రూపులతో కలిపి గరిష్ఠంగా 9సెక్షన్లకు మాత్రమే అనుమతులు ఇచ్చారు. విద్యార్థుల సంఖ్య తగ్గించడం, కరోనా కారణంగా పదో తరగతి విద్యార్థులందర్నీ ఉత్తీర్ణులను చేయడంతో ఇంటర్‌లో చేరేవారి సంఖ్య పెరుగుతుందనే ఉద్దేశంతో కొత్తగా సుమారు 120 కాలేజీలకు కొత్తగా అనుమతులు ఇచ్చారు. ఇక ఎంసెట్, నీట్, జేఈఈ పరీక్షల కోచింగ్ కోసం కాలేజీలు ప్రత్యేకంగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు విధానం: విద్యార్థులు ఎక్కడి నుంచైనా ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. వారికి నచ్చిన కాలేజీని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్ని కాలేజీలకైనా ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. కాలేజీలు ఇంటర్ ఫస్టియర్‌కి గతంలో ఉన్న విధంగా రూ.3,119, సెకండియర్‌కి రూ.3,432 మాత్రమే ఫీజులు వసూలు చేయాల్సి ఉంటుంది. Also read: Also read:
from Education News in Telugu: News on Board Exam Results, Job Notifications, University Results in Telugu https://ift.tt/34AtSvJ
0 Comments