ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల

ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ట్రేడ్స్‌మ్యాన్ (యాన్సిల్లరీ) తుది ఫలితాలను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. ఫలితాలతోపాటు కటాఫ్ మార్కుల వివరాలను కూడా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అందుబాటులో ఉంచింది. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ట్రేడ్స్‌మ్యాన్ (యాన్సిల్లరీ) పరీక్షకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు. రాతపరీక్షలో అర్హత సాధించినవారికి తర్వాతి దశలో మెడికల్ పరీక్ష నిర్వహించనున్నారు. మెడికల్ పరీక్ష నిర్వహించే తేదీ, వేదిక వివరాలను అభ్యర్థులకు ఈమెయిల్ ఐడీ ద్వారా చేరవేస్తారు. మెడికల్ పరీక్షకు హాజరయ్యే వారందరికీ ఉద్యోగాలు రావనే విషయాన్ని అభ్యర్థులు గమనించాల్సి ఉంటుంది. వీరు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన అటెస్టేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తును నింపి, మెడికల్ పరీక్షకు వచ్చేప్పుడు తీసుకురావాల్సి ఉంటుంది. అక్కడ అధికారులకు ఈ పత్రాలను సమర్పించాలి. Read Also: అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 99575 50709, 9957 550716 నెంబర్లలో సంప్రదించాల్సి ఉంటుంది. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ట్రేడ్స్‌మ్యాన్ (యాన్సిల్లరీ) కింద వాటర్ క్యారియర్, సఫాయ్‌వాలా, వాషర్‌మ్యాన్, బార్బర్, గార్డెనర్, టైలర్, కాబ్లర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సెవంత్ పే మ్యాట్రిక్స్‌లో లెవల్-2 (క్యారియర్, సఫాయ్‌వాలా, వాషర్‌మ్యాన్, బార్బర్) ఉద్యోగాలకు రూ.21,700, లెవల్-3 (టైలర్, కాబ్లర్) ఉద్యోగాలకు రూ.19,900 వేతనంగా చెల్లిస్తారు. ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. Read More..➦ ➦


from Education News in Telugu: News on Board Exam Results, Job Notifications, University Results in Telugu https://ift.tt/2JxHL2A

Post a Comment

0 Comments