ప్రభుత్వ జూనియర్ కాలేజీ లెక్చరర్ల నియామకాల్లో భాగంగా ఇంటర్వ్యూకు ఎంపికైన వారి జాబితాను ప్రకటించింది. జూనియర్ లెక్చరర్ (జేఎల్) పోస్టుల భర్తీ కోసం ఈ ఏడాది ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు నిర్వహించిన ఆన్‌లైన్ మెయిన్స్ ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఇంటర్వ్యూలకు రాష్ట్ర వ్యాప్తంగా 346 మంది అభ్యర్థులు ప్రొవిజినల్‌గా ఎంపికయ్యారు. అభ్యర్థుల వివరాలు వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచారు. విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఆయా అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని.. ఇంటర్వ్యూలు ఎప్పడన్నదీ త్వరలో తెలియజేస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి తెలిపారు. ఫలితాల నోటిఫికేషన్: వెబ్‌సైట్లో గ్రూప్-1 మెయిన్స్ హాల్‌టికెట్లు: నవంబర్ 2 నుంచి 13 వరకు జరగనున్న గ్రూప్-1 మెయిన్స్ హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. ఏపీలోని 13 జిల్లా కేంద్రాలతో పాటు హైదరాబాద్‌లోనూ పరీక్షలు నిర్వహించనున్నారు
from Education News in Telugu: News on Board Exam Results, Job Notifications, University Results in Telugu https://ift.tt/34fpPnW


0 Comments