రాష్ట్రంలో పరీక్షల సందడి మొదలైంది. ఇప్పటికే ప్రవేశ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇక కొద్ది రోజుల్లోనే డిగ్రీ, పీజీ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిగ్రీ, పీజీ చివరి సంవత్సరం చివరి సెమిస్టర్ పరీక్షలను విద్యార్థులు వారు చదివిన కాలేజీల్లోనే రాసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి విన్నపం మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ ఈ అనుమతి మంజూరు చేశారు. సెప్టెంబరు 15, 16 తేదీల్లో పరీక్షలు ప్రారంభమవుతుండగా మూడు రోజులు ముందుగా ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. యూజీసీ ఆదేశాల ప్రకారం యూజీ, పీజీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించక తప్పని పరిస్థితి. దీంతో యూనివర్సిటీలు ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నాయి. ఇప్పటికే పరీక్షల షెడ్యూల్స్ కూడా ప్రకటించాయి. Must read:
from Education News in Telugu: News on Board Exam Results, Job Notifications, University Results in Telugu https://ift.tt/2Ftor7A


0 Comments