ఆంధ్రప్రదేశ్‌లో లాసెట్/పీజీలాసెట్ కౌన్సెలింగ్ అక్టోబరు 28 నుంచి ప్రారంభంకానుంది. పరీక్ష ఫలితాలు మూడు, ఐదు సంవత్సరాల లా కోర్సుతోపాటు, ఎల్‌ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. అక్టోబరు 28 నుంచి నవంబరు 2 వరకు కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. షెడ్యూలు ప్రకారం అక్టోబరు 28 నుంచి 31 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. కౌన్సెలింగ్ కోసం ఆంధ్రాయూనివర్సిటీ, ఎస్వీయూ, ఏఎన్‌యూ, ఎస్కేయూ యూనివర్సిటీల్లో సహాయక కేంద్రాలను ఏర్పాటు చేశారు. Read Also: ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సర్టిఫికేట్లను పరిశీలిస్తారు. ఎన్‌సీసీ అభ్యర్థులకు అక్టోబరు 28, 29 తేదీల్లో; దివ్యాంగులు, క్యాప్ కేటగిరీ అభ్యర్థులకు అక్టోబరు 30న, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు అక్టోబరు 31న కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. Read Also: ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన అభ్యర్థులు నవంబరు 1 వరకు వెబ్‌ఆప్లన్ల నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నవంబరు 2న సాయంత్రం 5 గంటల వరకు వెబ్‌ఆపన్లలో మార్చుకునే వెసులుబాటు కల్పించారు. నవంబరు 3న సాయంత్రం 6 గంటల తర్వాత అభ్యర్థులకు సీట్లను కేటాయిస్తారు. Read Also: సర్టిఫికేట్ పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థులు అన్ని విద్యార్హత సర్టిఫికేట్లతోపాటు.. అవసరమైనవారు కుల, స్థానిక ధ్రువపత్రాలను తీసుకురావాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ల పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థులు కౌన్సెలింగ్ కేంద్రంలోనే ప్రాసెసింగ్ ఫీజుగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..
Read More..➦ ➦
| సర్టిఫికేట్ వెరిఫికేషన్ | కోర్సు | ర్యాంకు | వెబ్‌ఆప్షన్లు |
| 28.10.2019 | ఎల్‌ఎల్‌బీ (3 సం.) | 1 - 2400 వరకు | 28.10.19 - 29.10.19 |
| 29.10.2019 | ఎల్‌ఎల్‌బీ (3 సం.) | 2401 - 4800 వరకు | 29.10.19 - 30.10.19 |
| 30.10.2019 | ఎల్‌ఎల్‌బీ (3 సం.) | 4801 - చివరి ర్యాంకు వరకు | 30.10.19 - 31.10.19 |
| 31.10.2019 (ఉదయం) | ఎల్‌ఎల్‌బీ (5 సం.) | 1 నుంచి చివరి ర్యాంకు వరకు | 31.10.19 - 01.11.19 |
from Education News in Telugu: News on Board Exam Results, Job Notifications, University Results in Telugu https://ift.tt/2pSQO7n


0 Comments