AP: ప్రభుత్వం వినూత్న నిర్ణయం.. గ్రామీణ విద్యార్థుల కోసం విద్యా వారధి మొబైల్‌ వాహనాలు ప్రారంభం

ఏపీలో విద్యా వారధి మొబైల్‌ వాహనాలను విద్యాశాఖ మంత్రి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలకు అందుబాలోకి తీసుకు వచ్చినట్లు సురేష్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా సమయంలో విద్యకు దూరంగా ఉండకూడదు అనే ఉద్దేశ్యంతో సప్తగిరి ఛానెల్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలో అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 38 లక్షల మంది విద్యార్థులు ఉంటే.. వారిలో లక్షపద్దెనిమిది వేల మంది విద్యార్థులకు ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం అనుభవం లేదని, విద్యా వారధి మొబైల్ వ్యాన్ ప్రతి జిల్లాకు వెళ్లి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువస్తుందని మంత్రి సురేష్‌ పేర్కొన్నారు. సెప్టెంబర్ 5 తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అలాగే ఇంగ్లిష్‌ మీడియంలోనూ కట్టుబడి ఉన్నామని తెలిపారు. విద్యా వ్యవస్థపై ఎంతటి ఖర్చుకైనా వెనకడుగు వేయమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేసినట్లు మంత్రి సురేశ్‌ వెల్లడించారు. Also read: Also read:


from Education News in Telugu: News on Board Exam Results, Job Notifications, University Results in Telugu https://ift.tt/30fJItp

Post a Comment

0 Comments