గ్రామ సచివాలయ పరీక్షలు ప్రారంభం

ఏపీలో కొత్తగా ఏర్పాటుకానున్న గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రాతపరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం (సెప్టెంబరు 1) ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 4,478 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయా పరీక్ష కేంద్రాల పరిధిలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్ష రాసే అభ్యర్థుల కోసం APSRTC ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. సెప్టెంబరు 1న ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు మొదటి సెషన్‌లో పంచాయితీ కార్యదర్శి(గ్రేడ్‌-5), వార్డు మహిళా పోలీసు, మహిళా శిశు సంక్షేమ సహాయకులు, వార్డు పరిపాలన కార్యదర్శి, విద్యా కార్యదర్శి పోస్టులకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్-6)-డిజిటల్ అసిస్టెంట్ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించనున్నారు. సెప్టెంబరు 1న జరిగే పరీక్షలకు మొత్తం 15,50,002 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో మొదటి సెషన్ పరీక్షలకు 12,10,432 మంది అభ్యర్థులు, రెండోసెషన్ పరీక్షలకు 3,39,570 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్షల కోసం 13 జిల్లాల పరిధిలో 4,478 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక సెప్టెంబరు 3 నుంచి 8 వరకు జరిగే మిగతా ఉద్యోగాల రాతపరీక్షలకు మాత్రం 7 జిల్లాల పరిధిలో 536 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. Read Also: ఏపీలో అక్టోబరు 2 నుంచి గ్రామ/వార్డు సచివాలయాల వ్యవస్థ అమల్లోకి రానున్న సంగతి తెలిసిందే. ఆయా సచివాలయాల్లో మొత్తం 1.26 లక్షల ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రభుత్వం జులై 26న వేర్వేరుగా నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఆగస్టు 11 వరకు దరఖాస్తులు స్వీకరించింది. Read Also: గ్రామ సచివాలయ పోస్టులకు మొత్తం 21,69,814 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి సెప్టెంబరు 1 నుంచి 8 వరకు రాతపరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్ష రాసిన రోజే ప్రిలిమినరీ ఆన్సర్ కీ విడుదల చేయనున్నారు. పరీక్షలు పూర్తయిన 15 రోజుల్లోనే ఫలితాలను ప్రకటించనున్నారు. Read Also:


from Education News in Telugu: News on Board Exam Results, Job Notifications, University Results in Telugu https://ift.tt/2PD7hZJ

Post a Comment

0 Comments