తెలంగాణలో 'గ్రూప్-2' అభ్యర్థులకు సెప్టెంబరు 8న కంప్యూటర్ నాలెడ్జ్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ నుంచి ఆగస్టు 29న అధికారిక ప్రకటన వెలువడింది. గ్రూప్-2 ఇంటర్వ్యూకు హాజరై.. వివిధ విభాగాల్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులను ఎంపిక చేసుకున్న అభ్యర్థులు సెప్టెంబరు 8న హైదరాబాద్‌లో జరిగే కంప్యూటర్ నాలెడ్జ్ ( Proficiency in Office Automation with usage of Computer and Associated Software) పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. పరీక్షకు సంబంధించిన షెడ్యూలును త్వరలో ప్రకటించనున్నారు. హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు . పరీక్ష వివరాలు ఇలా.. ✦ మొత్తం 50 మార్కులకు కంప్యూటర్ నాలెడ్జ్ పరీక్ష నిర్వహిస్తారు. ✦ పరీక్షలో మొత్తం నాలుగు (A,B,C,D) పార్ట్‌లు ఉంటాయి. ✦ పరీక్షలో పార్ట్-A (ఎంఎస్ వర్డ్)-20 మార్కులు, పార్ట్-B (ఎంఎస్ ఎక్సెల్)-15 మార్కులు, పార్ట-C (ఎంఎస్ పవర్ పాయింట్)-10 మార్కులు, పార్ట్-D (ఇంటర్నెట్)-5 మార్కులు ఉంటాయి. ✦ పరీక్ష సమయం 30 నిమిషాలు. ✦ అర్హత మార్కులను ఓసీ-20, బీసీ-17.5, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు-15 గా కేటాయించారు.
from Education News in Telugu: News on Board Exam Results, Job Notifications, University Results in Telugu https://ift.tt/2MJumYz


0 Comments