TS: ఇంటర్‌, టెన్త్‌ పరీక్షలపై విద్యాశాఖ కీల‌క నిర్ణ‌యం

తెలంగాణలో ఇంటర్‌ వార్షిక పరీక్షలను 2021 ఏప్రిల్‌ నెలాఖరున.. పదో తరగతి పరీక్షలను మే నెలలో నిర్వహించే విధంగా విద్యాశాఖ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. వీటితో పాటు పది, ఇతర పరీక్షలను కూడా నిర్వహించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసినట్టు సమాచారం. ఏప్రిల్‌ నెలాఖరులో పదో తరగతి పరీక్షలు మొదలైతే అవి పూర్తయ్యేటప్పటికి మే 10 అవుతుంది. ఆ వెంటనే ఇంటర్‌ పరీక్షలు ప్రారంభించే ఆలోచన చేస్తున్నారు. ఇంతకు ముందు ఇంటర్‌బోర్డు ప్రకటించిన అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం మార్చి 24 నుంచి ఇంటర్‌ పరీక్షలు మొదలు కావాలి. తాజాగా వాటిని మే నెలలో ఆరంభించాలని చిత్రారామచంద్రన్‌ ఆదేశించినట్లు తెలిసింది. Must read: డిసెంబరు 1 నుంచి స్కూళ్లు, కాలేజీలు ప్రారంభిస్తే.. విద్యార్థులకు కనీసం ఐదు నెలలైనా విద్యా బోధన చేసిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది. ప్రశ్నపత్రంలో మార్పులకు నో..!ఇంటర్‌ ప్రశ్నపత్రాల విధానంలో మార్పులు చేయకూడదని విద్యాశాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రశ్నపత్రాల్లో సడలింపులు ఇస్తే విద్యార్థులు జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రవేశపరీక్షల్లో రాణించడం కష్టమవుతుందని అధికారుల భావిస్తున్నారు. అదే సమయంలో పదో తరగతి విద్యార్థులకు ప్రశ్నపత్రాల్లో ఇప్పటివరకు ఉన్న దాని కంటే చాయిస్‌ పెంచనున్నారు. Also read:


from Education News in Telugu: News on Board Exam Results, Job Notifications, University Results in Telugu https://ift.tt/36hVbKs

Post a Comment

0 Comments