
తెలంగాణ ఎంసెట్ ఫార్మసీ కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఎంసెట్ అగ్రికల్చర్ విభాగంలో ఉత్తీర్ణులైన విద్యార్థులు నాలుగేళ్ల బీఫార్మసీ, ఆరేళ్ల ఫార్మా-డితో పాటు బీటెక్ బయోటెక్నాలజీ కోర్సుల్లో చేరేందుకు నవంబరు 19వ తేదీ నుంచి ఎంసెట్ బైపీసీ-2020 ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. మొత్తం మూడు కోర్సుల్లో దాదాపు 8 వేల వరకు సీట్లు అందుబాటులో ఉంటాయి. బైపీసీ విద్యార్థులు బీటెక్ బయోటెక్నాలజీలో చేరేందుకు గణితం బ్రిడ్జి కోర్సు చేయాల్సిన అవసరం లేదని ఏఐసీటీఈ ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక ప్రైవేట్ కాలేజీల్లో స్పాట్ ప్రవేశాలకు డిసెంబరు 5వ తేదీన మార్గదర్శకాలు జారీ చేస్తారు. ధ్రువపత్రాల పరిశీలన కోసం ఈ నెల 19 నుంచి 21 వరకు బుకింగ్ నమోదు చేసుకోవాలి. ఈ నెల 20, 21న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఈ నెల 20 నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్లకు గడు ఇచ్చారు. ఈ నెల 24న ఫార్మసీ సీట్ల కేటాయింపు జరగనుంది. అదేవిధంగా చివరి విడత ధ్రువపత్రాల పరిశీలన కోసం డిసెంబరు 1న స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. డిసెంబర్ 2న రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. డిసెంబరు 2, 3 తేదీల్లో రెండో విడత వెబ్ ఆప్షన్లకు గడువు ఇచ్చారు. డిసెంబరు 5న అభ్యర్థులకు ఫార్మసీ సీట్ల కేటాయింపు జరగనుంది. కౌన్సెలింగ్ షెడ్యూల్:
- నవంబర్ 19-20వ తేదీ వరకు: స్లాట్ బుకింగ్
- 20-21: ధ్రువపత్రాల పరిశీలన
- 20-22 : వెబ్ ఆప్షన్లు
- నవంబర్ 24: తొలి విడత సీట్ల కేటాయింపు
- డిసెంబరు 1: స్లాట్ బుకింగ్
- డిసెంబరు 2: ధ్రువపత్రాల పరిశీలన
- డిసెంబర్ 2-3: వెబ్ ఆప్షన్లు
- డిసెంబర్ 5: సీట్ల కేటాయింపు
from Education News in Telugu: News on Board Exam Results, Job Notifications, University Results in Telugu https://ift.tt/32HPdlj
0 Comments