
జవహర్ నవోదయల్లో ఆరో తరగతి ప్రవేశానికి నోటిఫికేషన్ వెలువడింది. ఈ పరీక్షలో ఎంపికైతే చాలు.. ప్లస్ 2 (ఇంటర్) వరకు ఉచితంగా చదువు, వసతి, భోజనం కల్పిస్తారు. బోధన కూడా అత్యున్నత ప్రమాణాల్లో ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యాలయాల్లో వచ్చే విద్యా సంవత్సరం (2021-22) ఆరో తరగతిలో ప్రవేశానికి ప్రకటన వెలువడింది. ఈ జవహర్ నవోదయాలు దేశవ్యాప్తంగా 661 ఉన్నాయి. వీటిలో ఏపీలో 15 (2 కొత్తవి), తెలంగాణలో 9 ఉన్నాయి. ఒక్కో నవోదయ విద్యాలయంలో గరిష్ఠంగా 80 మంది విద్యార్థులకు ఆరో తరగతిలో ప్రవేశం లభిస్తుంది. 2020-2021 విద్యా సంవత్సరంలో అయిదో తరగతి చదువుతున్నవారు విద్యాలయ సెలక్షన్ టెస్టు (జేఎన్‌వీఎస్‌టీ) రాసుకోవచ్చు. అభ్యర్థులు ప్రవేశం కోరే జిల్లాలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో చదువుతున్నవారై ఉండాలి. విద్యార్థులు ఒకసారి మాత్రమే పరీక్ష రాయడానికి అర్హులు. గ్రామీణ విద్యార్థులకు 75 శాతం:75 శాతం సీట్లను గ్రామీణ ప్రాంతంలో చదివిన విద్యార్థులతో భర్తీ చేస్తారు. గ్రామీణ ప్రాంత కోటాలో సీటు ఆశించే విద్యార్థులు 3,4,5 తరగతులను పూర్తిగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ స్కూళ్లలో లేదా గుర్తింపు పొందిన ఇతర స్కూళ్లలో చదవివుండాలి. మిగిలిన 25 శాతం ఇతర ప్రాంతాలవారికి అవకాశం కల్పిస్తారు. మొత్తం సీట్లలో మూడో వంతు బాలికలకు కేటాయించారు. ఎస్సీలకు 15, ఎస్టీలకు 7.5, ఓబీసీలకు 27 శాతం సీట్లు ఉంటాయి. దివ్యాంగులకు కొన్ని సీట్లు కేటాయిస్తారు. ఉన్నతమైన బోధన:ఈ పరీక్షలో ఎంపికైన వాళ్లు ఆరో తరగతి నుంచి +2 వరకు ఉచితంగా చదువుతోపాటు వసతి, భోజనం పొందవచ్చు. మిగిలినవారు తొమ్మిదో తరగతి నుంచి నెలకు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది. ఉన్నత బోధన ప్రమాణాలు నవోదయ విద్యాలయాల సొంతం. ఎనిమిదో తరగతి వరకు మాతృ భాష లేదా ప్రాంతీయ భాషలో విద్య అభ్యసించవచ్చు. తొమ్మిది నుంచి ఆంగ్ల మాధ్యమం ఉంటుంది. సీబీఎస్‌ఈ సిలబస్ బోధిస్తారు. ఇక్కడ రెగ్యులర్ చదువతోపాటు నీట్, జేఈఈ వంటి జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలకు కూడా శిక్షణ ఇస్తున్నారు. ముఖ్య సమాచారం:
- అర్హత: 2020-2021 విద్యా సంవత్సరంతో 5వ తరగతి చదువుతున్న వారు అర్హలు.
- వయసు: మే 1, 2008 - ఏప్రిల్ 30, 2012 మధ్య జన్మించినవారు అర్హులు.
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: డిసెంబరు 15, 2020
- పరీక్ష తేదీ: ఏప్రిల్ 10, 2021
- వెబ్‌సైట్:
from Education News in Telugu: News on Board Exam Results, Job Notifications, University Results in Telugu https://ift.tt/32bG7Nq
0 Comments