విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీల్లో సీట్ల భర్తీకి ప్రత్యేక కౌన్సెలింగ్

ప్రఖ్యాత విద్యాసంస్థల్లో చదవాలని కోరుకునే విద్యార్థులకు గుడ్‌న్యూస్‌. ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీ, ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే సాంకేతిక విద్యా సంస్థల్లో (జీఎఫ్‌టీఐ) మిగిలిపోయిన సీట్ల భర్తీకి ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహించాలని (సీఎస్‌ఏబీ) నిర్ణయించింది. ఈ నెల 16 నుంచి రెండు విడతలుగా కౌన్సెలింగ్‌ ప్రక్రియ నిర్వహించేలా షెడ్యూల్‌ జారీ చేసింది. దేశంలోని జాతీయ స్థాయి విద్యా సంస్థలైన ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, జీఎఫ్‌టీఐ ప్రవేశాలకు జాయింట్‌ సీట్‌ అలకేషనల్‌ అథారిటీ (జోసా) గత నెల 6 నుంచి ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ఆరు విడతల్లో నిర్వహించింది. ఆరో విడత సీట్ల కేటాయింపును ఈ నెల 7న ప్రకటించిన విషయం తెలిసిందే. Must read: సీట్లు పొందిన విద్యార్థులంతా సోమవారం నుంచి 13వ తేదీలోగా జోసా పోర్టల్‌ ద్వారా ప్రవేశాల ఫీజును కొంత మొత్తం చెల్లించి సీట్లు ఖరారు చేసుకోవాలని జోసా వెల్లడించింది. ఆ కౌన్సెలింగ్‌ తరువాత ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, జీఎఫ్‌టీఐలలో మిగిలిన సీట్లకు ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు సీఎస్‌ఏబీ షెడ్యూల్‌ జారీ చేసింది. దీంతో మరికొంత మంది విద్యార్థులకు ఉన్నత చదువులు చదువుకునే అవకాశం లభించనుంది. Also read:


from Education News in Telugu: News on Board Exam Results, Job Notifications, University Results in Telugu https://ift.tt/35bF4ih

Post a Comment

0 Comments