
మహమ్మారి కారణంగా అన్నీ రంగాలు ఇబ్బందుల్లో పడిన విషయం తెలసిందే. ఐటీ సేవలందించే దిగ్గజ సాఫ్ట్‌వేర్ సంస్థలు సైతం ఒడిదుడుకుల ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది క్యాంపస్ సెలక్షన్స్ సైతం తగ్గనున్నాయి. ఇంజినీరింగ్ కాలజీల ప్లేస్‌మెంట్ అధికారుల అంచనా ప్రకారం.. ఈఏడాది కనీసం 20-30 శాతం వరకు క్యాంపస్ సెలక్షన్స్ తగ్గవచ్చని అంచనా. కొన్ని పరిశ్రమలు ఎంపికలు గణనీయంగా తగ్గించాయని వారు స్పష్టంచేస్తున్నారు. సాఫ్ట్‌వేర్ ఉత్పత్తి తరహా పరిశ్రమలు మాత్రం గతంలో మాదిరే నియామకాలు చేస్తున్నాయి. కొన్ని కంపెనీలు గత ఏడాది కంటే కాస్త మెరుగ్గా కొలువులు ఇస్తుండటం విశేషం. ఈసారి కరోనా కారణంగా రాత పరీక్ష, ఇంటర్వ్యూ ప్రక్రియ అంతా ఆన్‌లైన్ విధానంలోనే కొనసాగిస్తున్నాయి. Must read: ఏటా రాష్ట్రం నుంచి దాదాపు 30 వేల మంది ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రాంగణ నియామకాలకు ఎంపికవుతున్నారని అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఆ సంఖ్య 20 వేలకు పడిపోనున్నట్లు అంచనా. అలాగే.. విద్యార్థులు బీటెక్ మూడో సంవత్సరం నుంచి బయోడేటాను మెరుగుపరచుకోవాలని, అందుకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం తప్పనిసరి చేయాలని ప్లేస్‌మెంట్ అధికారులు సూచిస్తున్నారు. అంతా ఆన్‌లైన్‌లోనే..!క్యాంపస్ నియామకాలకు సంబంధించి రాతపరీక్ష, ఇంటర్వ్యూ అంతా ఆన్‌లైన్‌లోనే జరుపుతున్నందున ఫలితాల వెల్లడి ఆలస్యం అవుతోంది. టీసీఎస్ నింజా ఫలితాల కోసం వేలమంది ఎదురుచూస్తున్నారు. ఈ సంస్థ దేశవ్యాప్తంగా దాదాపు 40వేల మందిని ఎంపిక చేసుకుంటుంది. కాగ్నిజెంట్ కూడా ఈసారి ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించింది. ఫలితాలు వెలువడాల్సి ఉంది. క్యాప్ జెమినీ సైతం కాలేజీలకు వెళ్లకుండా విద్యార్థులందరికీ కలిపి ఆన్‌లైన్ పరీక్ష జరిపింది. Also read:
from Education News in Telugu: News on Board Exam Results, Job Notifications, University Results in Telugu https://ift.tt/38u3e9K
0 Comments