
రాష్ట్రంలో సోమవారం నుంచి స్కూళ్లు, కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయని ఏపీ విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేశ్ చెప్పారు. పాఠశాలల అకడమిక్ ఇయర్ ఏప్రిల్‌తో ముగుస్తుందన్నారు. కోల్పోయిన విద్యా సంవత్సరాన్ని కవర్ చేసుకునేలా సిలబస్ రూపకల్పన చేశామన్నారు. కేంద్రం మార్గదర్శకాలను పాటిస్తూ పాఠశాలలు తెరుస్తున్నట్లు చెప్పారు. అన్ని జాగ్రత్తలతో స్కూళ్లు తెరుస్తున్నామన్నారు. సోమవారం నుంచి 9, 10, ఇంటర్ సెకండియర్ తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. నవంబరు 16 నుంచి ఇంటర్ ఫస్టియర్ తరగతులు, 23వ తేదీ నుంచి 6, 7, 8 తరగతులు, డిసెంబరు 14వ తేదీ నుంచి 1-5 తరగతులు మొదవుతాయన్నారు. 23 నుంచి రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లు ప్రారంభమవుతాయని తెలిపారు. తల్లిదండ్రులు ఆందోళన చెందకుండా శానిటైజేషన్ జాగ్రత్త చర్యలు తీసుకున్నామన్నారు. కాలేజీలు సైతం:అకడమిక్ క్యాలెండర్‌ను అనుసరించి.. యూజీ/పీజీ ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్స్ నిర్వహించే కాలేజీలలో సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ తరగతులు నవంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 6వ తేదీతో సెమిస్టర్ ముగుస్తుంది. తర్వాత సెమిస్టర్ మార్చి 25 నుంచి ఆగస్టు 7 వరకు జరుగుతుంది. సాధారణంగా ఏప్రిల్ 30తో ముగియాల్సిన విద్యా సంవత్సరం కొవిడ్ నేపథ్యంలో ఈ సారి ఆగస్టు 7తో ముగుస్తుంది. వేసవి సెలవుల ప్రస్తావన క్యాలెండర్‌లో లేదు. మాస్కు, ఆరు అడుగుల భౌతిక దూరం వంటి కొవిడ్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు.
from Education News in Telugu: News on Board Exam Results, Job Notifications, University Results in Telugu https://ift.tt/35TryPx
0 Comments