AP: కాలేజీ ఫీజులపై ఒత్తిడి వద్దు.. జగనన్న విద్యా దీవెన మార్గదర్శకాలు జారీ..!

ఏపీ ప్రభుత్వం పథకం ద్వారా ఫీజుల చెల్లింపుల విధానానికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరం (2020-21) నుంచి ఈ పథకం ద్వారా నేరుగా విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులను ప్రభుత్వం జమ చేయనున్న సంగతి తెలిసిందే. కాగా ఫీజుల డబ్బుల కోసం అడ్మిషన్ల సమయంలో విద్యార్థులను ఒత్తిడి చేయవద్దని.. కాలేజీల్లో తల్లిదండ్రులు పరిశీలించిన సౌకర్యాలను విద్యార్థి చదువు పూర్తయ్యే వరకు యథాతథంగా కొనసాగించాలని యాజమాన్యాలకు ప్రభుత్వం సూచించింది. Must read: తల్లులకే బాధ్యత:
  • నాలుగు త్రైమాసికాల్లో ప్రభుత్వం ఇచ్చే ఫీజుల డబ్బులను విద్యార్థి తల్లి కాలేజీలకు చెల్లిస్తుంది.
  • తమ పిల్లలకు నాణ్యమైన విద్య అందుతోందా? లేదా? అనే విషయాన్ని పరిశీలించేందుకు తల్లులు తరచూ కాలేజీని సందర్శిస్తారు.
  • విద్యార్థి ఎలా చదువుతున్నాడో తెలుసుకునేందుకు తల్లిదండ్రులు ప్రతి త్రైమాసికంలో కాలేజీలను సందర్శించాలి.
  • ప్రభుత్వం విద్యార్థి తల్లి ఖాతాకు ఫీజుల డబ్బులు విడుదల చేసిన వారం రోజుల్లో కాలేజీల్లో చెల్లించాలి.
  • కాలేజీలో చెల్లించకుంటే ప్రభుత్వం బాధ్యత వహించదు. తదుపరి విద్యార్థికి జగనన్న విద్యా దీవెన పథకం కింద డబ్బులు వేయడం ఆపివేస్తారు.
ఫిర్యాదు మార్గాలివే..!కాలేజీలో సౌకర్యాలు సరిగా లేవని భావిస్తే జ్ఞానభూమి పోర్టల్‌లో విద్యార్థి లాగిన్‌ అయి తల్లులు ఫిర్యాదు చేయవచ్చు. లేదా స్పందన పోర్టల్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. లేదా 1902కి కాల్‌ చేసి తెలియ చేయవచ్చు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. తల్లుల ఖాతాలకు జగనన్న వసతి దీవెన డబ్బులు విడుదల చేసిన వెంటనే వసతి ఖర్చుల కోసం చెల్లించాల్సి ఉంటుంది. Also read:


from Education News in Telugu: News on Board Exam Results, Job Notifications, University Results in Telugu https://ift.tt/2TZdezu

Post a Comment

0 Comments