AP: ప్రైవేటు స్కూళ్లకు భారీ షాక్‌.. ఫుల్‌ ఖుషీలో విద్యార్థులు, తల్లిదండ్రులు..!

ప్రైవేట్ స్కూల్స్‌కు ఏపీ సర్కార్ గట్టి షాక్ ఇచ్చింది. ప్రైవేట్ స్కూళ్ల ఆగడాలకు చెక్ పెడుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్ధులు.. ప్రభుత్వ బడులలో చేరాలంటే ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్() అవసరం లేదని స్పష్టం చేసింది. కేవలం తల్లిదండ్రుల అంగీకార పత్రం ఉంటే చాలని పేర్కొంటూ.. ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులకు టీసీలు ఇవ్వడంలో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ఇబ్బంది పెడుతుండటం.. కరోనా వల్ల చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్థికంగా దెబ్బతిన్నారు. అయితే.. తమకు మాత్రం ఫీజులు చెల్లించాల్సిందేనంటూ ప్రైవేట్ స్కూల్స్ ఒత్తిడి చేస్తున్నాయి. పాత ఫీజులు చెల్లిస్తేనే కొత్త తరగతులకు కూర్చోబెడతామని హెచ్చరించే స్కూల్స్ కూడా ఉన్నాయి. ఈ నేపధ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం విద్యార్థులు, తల్లిదండ్రులకు ఉపయుక్తంగా మారనుంది. Must read: అలాగే.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ స్కూల్స్‌కు ధీటుగా సర్కారీ బడులను ఏపీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఈ మేరకు అమ్మ ఒడి, జగనన్న విద్యాదీవెన, నాడు-నేడు వంటి విప్లవాత్మక పథకాలతో పాటు.. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంను అమలు చేయడానికి కూడా సిద్దమవుతోంది. అలాగే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్ధులకు అమ్మఒడి పధకం ద్వారా ఆర్ధిక సాయాన్ని అందిస్తోంది. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలపై వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రయివేటు స్కూళ్లకు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. Also read:


from Education News in Telugu: News on Board Exam Results, Job Notifications, University Results in Telugu https://ift.tt/2JquM5D

Post a Comment

0 Comments