ABVKY నిరుద్యోగ భృతి.. దరఖాస్తు విధానం ఇదే..!

కరోనా మహమ్మారి కారణంగా లక్షలాది మంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయారు. ఇలాంటి వారు కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐ) ఆధ్వర్యంలోని పథకం ద్వారా మూడు నెలల పాటు నిరుద్యోగ భృతిని పొందొచ్చు. ఆ పథకం పేరే అటల్‌ బీమిత్‌ వ్యక్తి కళ్యాణ్‌ యోజన (). విపత్కర పరిస్థితుల్లో ఉపాధిని కోల్పోయిన కార్మికవర్గం కోసం కేంద్రం ఈ పథకాన్ని ఈఎస్‌ఐ ద్వారా అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనున్న వాళ్లు డిసెంబర్‌ 31లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇది ఈఎస్‌ఐ పరిధిలోని కార్మికులకే వర్తిస్తుంది. దరఖాస్తు విధానం:
  • మొదట పోర్టల్‌లోకి లాగిన్‌ కావాలి.
  • ఏబీవీకేవై క్లెయిమ్‌ పొందేందుకు ఉద్దేశించిన విభాగంపై క్లిక్‌ చేయాలి.
  • ఆ దరఖాస్తులో నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కావాలనుకుంటున్నారో నమోదు చేసి సబ్‌మిట్‌పై క్లిక్‌ చేయాలి.
  • నిరుద్యోగ కాల వివరాలను నమోదు చేసిన ఏబీ–1 ఫామ్‌ ప్రింట్‌ తీసుకొని అందులో ఉన్న విషయాన్ని రూ.20 స్టాంప్‌ పేపర్‌పై టైపు చేయించి నోటరీ చేయించాలి.
  • దానిపై దరఖాస్తుదారు సంతకం చేయాలి.
  • ఏబీ–2 అనే ఫారంనూ ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
  • దానిపై సంబంధిత కంపెనీ యాజమాన్యం సంతకం చేయించాలి.
Must read: నిబంధనలివే..!
  • యాజమాన్యం ధ్రువీకరించకపోతే పీఎఫ్‌ నంబర్‌ను దరఖాస్తుపై వేసి ఈఎస్‌ఐ కార్యాలయంలో సమర్పించాలి.
  • ఈఎస్‌ఐ కార్డు, ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు అఫిడవిట్‌కు జత చేయాలి.
  • నిరుద్యోగ భృతి కావాలనుకున్న సమయంలో సంబంధిత దరఖాస్తుదారు ఉద్యోగం లేకుండా ఉండాలి.
  • ఉద్యోగం పోగొట్టుకోవడానికి ముందు కనీసం రెండేళ్లపాటు ఆయా సంస్థల్లో పని చేసి ఉండాలి.
  • ఏదో ఒక కారణంతో ఉద్యోగం పోగొట్టుకున్న వారు ఈ పథకానికి అనర్హులు.
  • ఉద్యోగులను తీసివేసినట్టు యాజమాన్యాలు ధ్రువీకరించకపోతే సమీపంలోని ఈఎస్‌ఐ కార్యాలయంలో అధికారిని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి.
Also read:


from Education News in Telugu: News on Board Exam Results, Job Notifications, University Results in Telugu https://ift.tt/36qlC0Q

Post a Comment

0 Comments