TS EAMCET: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఎంసెట్‌ ర్యాంకులపై కీలక నిర్ణయం

తెలంగాణ విద్యార్ధులకు శుభవార్త. ఎంసెట్ ర్యాంకుల గందరగోళం నేపథ్యంలో ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంసెట్ ర్యాంకుల్లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇవ్వనున్నట్లు తెలిపారు. దరఖాస్తు ఫామ్‌లో హాల్ టికెట్ నెంబర్‌ను తప్పుగా నమోదు చేసుకున్నవారికి ర్యాంకులు ఇవ్వలేదన్న ఆయన.. ఈ రోజు హాల్ టికెట్ సరిచేసుకున్నవారికి రేపు ఉదయంలోగా ర్యాంకులు ఇస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా హాల్ టికెట్ సవరణకు జేఎన్టీయూ వరకు రావాల్సిన అవసరం లేదని.. ఎంసెట్ అఫీషియల్ వెబ్‌సైట్ ‌లో చేసుకోవచ్చునని గోవర్ధన్ తెలిపారు. Must read: కాగా.. తెలంగాణ ఎంసెట్‌ ఫలితాల్లో గందరగోళం నెలకొన్నట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. విద్యార్థులకు ఎంసెట్‌ ర్యాంకుల కేటాయింపుల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎంసెట్‌లో కటాఫ్‌ మార్కులు వచ్చినా.. ఇంటర్‌లో అన్ని సబ్జెక్టుల్లో పాసైనా కూడా ఫలితాల్లో మాత్రం అనుత్తీర్ణులైనట్లు ఫలితం చూపిస్తోందని విద్యార్థులు నిన్న కొంత ఆందోళన వ్యక్తం చేసిన విషయం కూడా విదితమే. Also read:


from Education News in Telugu: News on Board Exam Results, Job Notifications, University Results in Telugu https://ift.tt/3nrfwFb

Post a Comment

0 Comments